సైబర్ నేరగాళ్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన యువకుడు.. ఎలా అంటే?

షాహిద్ పర్వేజ్ అవసరాన్ని ఆసరాగా చేసుకొని రాజస్థాన్ నుంచి ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేసి సామాగ్రిని తరలిస్తానని నమ్మించాడు.

cyber crime

cyber crime : సైబర్ నేరగాళ్ల భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆన్ లైన్ లో ఆర్డర్ల విషయంలోనూ, బ్యాంకు రుణాల పేరుతో, లక్కీ డ్రా కలిసిందంటూ.. ఇలా పలురకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తద్వారా లక్షల్లో సొమ్ము దోచుకుంటున్నారు. ఇలాంటి తరహా ఘటనే తాజాగా చోటు చేసుకోగా.. అయితే, ఈసారి యువకుడు ఇచ్చిన షాక్ కు సైబర్ నేరగాడికి దిమ్మతిరిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూసఫ్ గూడ పరిధి వెంకటగిరిలో షాహిద్ పర్వేజ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. షాహిద్ పర్వేజ్ యూనిసెఫ్ లో పనిచేస్తున్నాడు. అతనికి ఇటీవల మహారాష్ట్రకు బదిలీ అయ్యింది. ఈ క్రమంలో ఇంట్లో సామాన్లు మహారాష్ట్రకు తరలించేందుకు ఆన్ లైన్ లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ కోసం వెతికాడు.

Also Read : అరె బాబూ ఇవే తగ్గించుకోవాలి..! ముంబై లోకల్ ట్రైన్‌లో యువకుడు ప్రమాదకర విన్యాసాలు.. వీడియో వైరల్

షాహిద్ పర్వేజ్ అవసరాన్ని ఆసరాగా చేసుకొని రాజస్థాన్ నుంచి ఓ సైబర్ నేరగాడు  ఫోన్ చేసి సామాగ్రిని తరలిస్తానని నమ్మించాడు. ఇందుకోసం రూ. 18వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఎక్స్‌ప్రెస్‌ ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ కు ఫోన్ చేసి సామాగ్రిని తరలించాలంటూ సూప‌ర్‌వైజ‌ర్‌తో మాట్లాడాడు. దీంతో అతను డ్రైవర్ నెంబర్ ను సైబర్ నేరగాడికి ఇచ్చాడు. డ్రైవర్ కూడా రాజస్థాన్ వ్యక్తి కావడంతో అతన్ని మచ్చికచేసుకున్న సైబర్ నేరగాడు.. నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను నేను చెప్పినట్లుగా వినాలని సూచించాడు. డ్రైవర్ కూడా సైబర్ నేరగాడి ఆఫర్ కు అంగీకరించాడు. ఆ తరువాత పటాన్ చెరులోని తమ సంస్థ గోదాం వద్దకు సామాగ్రిని తరలించారు. అనంతరం సైబర్ నేరగాడు షాహిద్ ను ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు.

Alsol Read : Star Actress : ఈ ఫొటోలో చిన్న పాపని గుర్తు పట్టారా?.. 60 ఏళ్ళు అంటూ బర్త్ డే విషెష్ చెప్తూ షేర్ చేసిన స్టార్ హీరోయిన్..

సామాన్లు ప్యాక్ చేసే సమయంలోనే ముందు జాగ్రత్తగా సాహిద్ పర్వేజ్ వాటిలో జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు. పదిరోజులు గడిచినా సామాన్లు రాకపోవడంతోపాటు అనుమానం వచ్చి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు జీపీఎస్ ట్రాకర్ సహకారంతో సైబర్ నేరగాడు కిషన్ సింగ్ గా గుర్తించారు. అతను పరారీలో ఉన్నాడు. అయితే, సైబర్ నేరగాడికి సహకరించిన ప్యాకర్స్ అండ్ మూవర్స్ డ్రైవర్ మంజిత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించిన యువకుడిని పోలీసులు అభినందించారు.

 

ట్రెండింగ్ వార్తలు