స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆగ్రహం

జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Hydra Commissioner Ranganath

ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న నేతలపై కేసులు బుక్ చేయాలని పోలీసులను ఆదేశించారు.

జగద్గిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై రంగనాథ్ మండిపడ్డారు. కుల సంఘాల పేరుతో కొంతమంది భూములను కబ్జా చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కమిషనర్ ఆదేశించారు.

జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్ లోని వేంకటేశ్వర దేవాలయం గుట్ట భూమి కబ్జా కు గురి అవుతుందని ఫిర్యాదు రావడంతో ఆ స్థలాన్ని రంగనాథ్ పరిశీలించారు.

కాగా, హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలో వెనకడుగు వేసేదేలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఆక్రమణదారులపై కేసుల నమోదుకు హైడ్రా పోలీస్ స్టేషన్​కు సంబంధించి సర్కారు ఉత్తర్వులు ఇస్తుందని చెప్పారు. ఇటీవలే ఆయన హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్, గురుబ్రహ్మనగర్ బస్తీ, తదితర ప్రాంతాల్లోనూ పర్యటించారు.

Chandrababu Naidu: నదుల అనుసంధానాన్ని చేసి చూపిస్తా: చంద్రబాబు