Chandrababu Naidu: నదుల అనుసంధానాన్ని చేసి చూపిస్తా: చంద్రబాబు
ఈ నెల చివర్లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తానని చంద్రబాబు చెప్పారు.

Chandrababu Naidu
బనకచర్లకు నీటిని తీసుకురావడం తన జీవిత కల అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బనకచర్ల నీరు తిరుమల వెంకన్న పాదాలకు తాకాలని చెప్పారు. నదుల అనుసంధానమే కరువు రహిత రాష్ట్రంగా మారడానికి కారణమని అన్నారు.
నదుల అనుసంధానం చేసి చూపిస్తానని చంద్రబాబు నాయుడు తెలిపారు. కొప్పర్తిని పారిశ్రామిక హబ్ గా మార్చే బాధ్యత తనదని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ తో జిల్లా ప్రగతి సాధ్యమని, స్టీల్ ప్లాంట్ పరిశీలనలో ఉందని తెలిపారు.
ఈ నెల చివర్లో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని, ఆఫీసులే మొబైల్లో ఉంటాయని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే కడప విమానాశ్రయం అభివృద్ధి అని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు కడప నుంచి విమానాలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
పర్యాటక ప్రదేశం గండికోటలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు తెలిపారు. రాజోలు ఆనకట్ట నిర్మిస్తానని మాట ఇస్తున్నానని చెప్పారు. రాజోలు ఆనకట్ట ద్వారా 90 వేల ఎకరాలకు నీళ్లిచ్చే భాద్యత తనదని తెలిపారు. గత ఎన్నికల్లో 93 శాతం సీట్లు తమవేనని చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నడూ అంత విజయం రాలేదని అన్నారు.
Delhi Election 2025: మహిళా ఓటర్లే టార్గెట్.. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల హామీల వర్షం