YS Sharmila : దమ్ముంటే.. బొడ్రాయి మీద ప్రమాణం చెయ్యి- మంత్రి కేటీఆర్‌కు వైఎస్ షర్మిల సవాల్

YS Sharmila : తెలంగాణ సొమ్ముతో సొంత ఖజానా నింపుకుని దేశ రాజకీయాలనే కొనేంత కాజేశారు. మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారు.

YS Sharmila (Photo : Twitter)

YS Sharmila – KTR : బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెలరేగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వరుస ట్వీట్ లతో అధికార పార్టీ నేతలను నిలదీస్తున్నారు. వారిపై సెటైర్లు వేస్తున్నారు. దమ్ముంటే.. అంటూ సవాళ్లు విసురుతున్నారు.

తాజాగా మరోమారు మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది కేటీఆర్ తీరు అని షర్మిల అన్నారు. దమ్ముంటే.. బొడ్రాయి మీద ప్రమాణం చెయ్యి అని చాలెంజ్ విసిరారు.(YS Sharmila)

Also Read..Pawan Kalyan Vs YCP : పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ కాపు లీడర్స్.. ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్

” దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది కేటీఆర్ తీరు. పోలీసులను అడ్డు పెట్టుకోవడం లేదట. ఓటర్లకు డబ్బు, మద్యం పంచట్లేదట. చిన్నదొర చెప్పిన ఈ దశాబ్దపు పెద్ద జోక్ ఇదే. పోలీసులు అడ్డు లేనిదే అడుగు కూడా బయట పెట్టలేనోడు. ముందుగానే ప్రశ్నించే గొంతులను హౌస్ అరెస్టులు చేయించేటోడు. అడ్డం పొడుగు మాటలు చెప్తే నమ్మే పిచ్చోళ్లు కాదు తెలంగాణ ప్రజలు. అన్నం పెట్టే రైతుకు బేడీలు వేసి, చంటి బిడ్డల తల్లులు అని చూడకుండా, జైళ్లకు పంపిన హింసాత్మక పాలన మీది. పోలీసు వ్యవస్థను మీ బానిస వ్యవస్థగా మార్చారు. అయ్యా చిన్న దొర కేటీఆర్.. మీరు నిజంగా సుద్ధపూసలే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

నేరెళ్ళలో దళితులపై పోలీసులను అడ్డు పెట్టుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదా?
ఇప్పటికీ నువ్వు సిరిసిల్ల పోతే 7 ఏళ్లుగా ఆ నేరెళ్ల మొత్తం హౌజ్ అరెస్ట్ చేయడం లేదా..?
మిడ్ మానేర్ ముంపు బాధితులు న్యాయమడిగితే అరెస్టులు చేయలేదా?
నిన్న గాక మొన్న వరంగల్ పోతే విద్యార్థి నాయకులను, ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయించ లేదా?(YS Sharmila)
నీ సభల కోసం జనాలు రాకపోతే పథకాలు కట్ అని బెల్లంపల్లిలో బెదిరించలేదా?
డబ్బు, మద్యం పంచనని దొంగ మాటలు చెప్పే దొర గారు.
మొన్నే జరిగిన సిరిసిల్ల కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? మద్యం పారించలేదా?
మునుగోడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటుకు 10వేలు పంచింది మీ సారథ్యంలోనే కదా!

Also Read.. Amadalavalasa Constituency: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

” సర్పంచ్ నుంచి ఎంపీ ఎలక్షన్ల దాకా డబ్బులు కుమ్మరించి, మద్యం ఏరులై పారించింది నీ తాలిబన్ల పార్టీ. సంతలో పశువులను కొన్నట్లు వేల కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొన్నది నీ పార్టీ. తెలంగాణ సొమ్ముతో సొంత ఖజానా నింపుకుని దేశ రాజకీయాలనే కొనేంత కాజేశారు.
మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారు. బందిపోట్ల రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం పంచబోమని బొడ్రాయి మీద ప్రమాణం చెయ్యి. నీ పాలన మీద నమ్మకమే ఉంటే పోలీసుల సాయం తీసుకోనని గ్రామ దేవతల మీద ఒట్టు వెయ్యి” అని మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు వైఎస్ షర్మిల.

‘ఎన్నికల్లో పైసలు పంచను, మద్యం పోయను.. పోలీసులను నమ్ముకుని రాజకీయాలు చేయడం నాకు చేతకాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను నమ్ముకుని వచ్చిన వాడిని.. వారి ఆశీర్వాదం ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మరింత అభివృద్ధి చేస్తా” అని.. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపైనే షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు.(YS Sharmila)

Also Read..Minister KTR : ఎన్నికల్లో పైసలు ఇవ్వా,మందు పోయా,మీరు కోరుకుంటే సిరిసిల్లో ఉంటా : కేటీఆర్