IIFL New Office : IIFL కార్యాలయానికి మై హోం గ్రూప్‌ చైర్మన్‌ డా.జూపల్లి రామేశ్వరావు ప్రారంభోత్సవం

త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని బ్రాంచులను విస్తరించబోతున్నట్లు ఐఐఎఫ్ఎల్ జాయింట్ సీఈవో ప్రకాశ్ తెలిపారు.

IIFL New Office : హైదరాబాద్ లో ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ కొత్త కార్యాలయం ప్రారంభమైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఈ కార్యాలయాన్ని మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రారంభించారు. ఆయనతో పాటు మై హోమ్ కన్ స్ట్రక్షన్స్ ఎండీ శ్యాంరావు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇండియాలోనే పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఐఐఎఫ్ఎల్.. ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగాలని ఈ సందర్భంగా మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ఆకాంక్షించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని బ్రాంచులను విస్తరించబోతున్నట్లు ఐఐఎఫ్ఎల్ జాయింట్ సీఈవో ప్రకాశ్ తెలిపారు.

 

Also Read : జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. అరెస్టుపై కీలక వ్యాఖ్యలు