శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తనిఖీలు : ఆఫ్ఘనిస్తాన్‌ వ్యక్తి దగ్గర ఇండియన్‌ ఆధార్‌ కార్డు

Indian Aadhaar card with Afghan person : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారం మరుకముందే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారుల తనిఖీల్లో ఆశ్చర్యకర విషయం బయటపడింది.

ఆఫ్ఘనిస్తాన్‌ కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఆ దేశ పాస్‌పోర్టు ఉండగా.. అతని బ్యాగ్‌లో ఇండియన్‌ పాస్‌పోర్టు లభ్యమైంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులు విచారిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వ్యక్తికి ఇండియన్‌ ఆధార్‌ కార్డు ఎలా వచ్చింది? ఇండియన్‌ ఆధార్‌ కార్డును ఎందుకు తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? అసలు ఆ వ్యక్తి హైదరాబాద్‌కు ఎందుకొచ్చాడు? అనేక కోణాల్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.