Tourism Minister Kishan Reddy : ట్రావెల్ ఏజెంట్లు,గైడ్లకు కేంద్ర రుణాలు-కిషన్ రెడ్డి

కోవిడ్ కారణంగా కుదేలైన పర్యాటక రంగంలోని ట్రావెల్ ఏజెంట్లను,  గైడ్ల ను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy

Union Minister Kishan Reddy :  కోవిడ్ కారణంగా కుదేలైన పర్యాటక రంగంలోని ట్రావెల్ ఏజెంట్లను,  గైడ్ల ను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  ఈరోజు ఆయన హైదరాబాద్‌లో   కేంద్ర పర్యాటక, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టూరిజమ్ ప్లాజాలో  టూరిజమ్ గైడ్లు, ఆపరేటర్లకు లోన్ గ్యారెంటీ స్కీమ్ కింద ఇచ్చే రుణాలకు సంబంధించిన చెక్కులను అందించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా టూరిజం మీద ఆధారపడిన వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయని  అన్‌లాక్ ప్రక్రియలో దెబ్బతిన్న గైడ్లు, ట్రావెల్ ఏజెంట్లను ఆదుకునేందుకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా, మినిమం ఇంట్రెస్ట్ తో భారత ప్రభుత్వం లోన్లు అందజేసేందుకు ముందుకొచ్చిందని చెప్పారు.

వాక్సినేషన్, మాస్కు  ధరించటం వంటి అన్ని రకాల జాగ్రత్తలతో పర్యాటకాన్ని మళ్లీ  పుంజుకునేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై  ఉందని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.  తెలంగాణలో యునెస్కో వారసత్వ కట్టడంగా రామప్పకు గుర్తింపు రావటం, భూదాన్ పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా నిలవడం మనకు గర్వకారణమని ఆయన అన్నారు.

Also Read :Selfie Craze Tragedy : సెల్ఫీలు దిగుతూ గోదావరిలో పడి ఇద్దరు యువకులు మృతి

హెరిటేజ్ సర్క్యూట్ కింద సెవెన్ టొంబ్స్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర నిర్ణయించిందని…. దీనిపై ఉన్న చిక్కుల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.  రైల్వే, టూరిజం శాఖ సంయుక్తంగా 3,600 కోచ్ లను ప్రైవేట్ సెక్టార్ కు ఇచ్చి వారికి అనుకూలంగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

నవోదయ పాఠశాలల్లో టూరిస్ట్ క్లబ్ లు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో  విద్యార్థులతో కూడిన టూరిస్ట్ క్లబ్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.