Telangana : మూడు రోజుల్లో వానలే..వానలు…కుండపోత ఖాయం!

తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకుపడనున్నాడు. రానున్న మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక IMD వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మూడు వారాల క్రితం జోరువానలతో హడలెత్తించిన వరుణుడు.. స్మాల్ బ్రేక్ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

Telangana : మూడు రోజుల్లో వానలే..వానలు…కుండపోత ఖాయం!

Rain

Updated On : August 12, 2021 / 7:49 AM IST

Telangana Raining : తెలంగాణపై మళ్లీ వరుణుడు విరుచుకుపడనున్నాడు. రానున్న మూడ్రోజుల్లో కుండపోత ఖాయమంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక IMD వార్నింగ్‌తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మూడు వారాల క్రితం జోరువానలతో హడలెత్తించిన వరుణుడు.. స్మాల్ బ్రేక్ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

Read More : Goa : నిందితులను నగ్నంగా గుంజీలు తీయించిన ఖైదీలు

రాత్రి వేళ ఉక్కపోత ఉండడంతో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపెడుతున్నాడు. అయితే, మరోసారి వర్షాలు దంచి కొడతాయని వాతావరణశాఖ తాజా హెచ్చరికాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కుండపోత వానలు కురిసే అవకాశముందని వార్నింగ్ ఇచ్చింది. పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read More : OBC Bill : ఓబీసీ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం

ఇటు మహానగరం హైదరాబాద్‌లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయన్న వాతావరణశాఖ.. ఈ గాలుల కారణంగానే వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే, రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో మరోసారి విస్తారంగా వర్షాలు కురవడం ఖాయమంటున్నారు. ఇక శుక్రవారం అల్పపీడనం ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.