Goa : నిందితులను నగ్నంగా గుంజీలు తీయించిన ఖైదీలు
లైంగికదాడి చేసిన రిమాండ్ నిమిత్తం జైలుకు వచ్చిన ఖైదీలను నగ్నంగా నిలబెట్టి గుంజీలు తీయించారు ఇతర ఖైదీలు. నిందితులు గుంజీలు తీస్తుండగా ఖైదీలు చప్పట్లు కొడుతూ...ఉత్సాహపరించేందుకు ప్రయత్నించారు. గోవాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

Goa Jail
Goa jail: లైంగికదాడి చేసిన రిమాండ్ నిమిత్తం జైలుకు వచ్చిన ఖైదీలను నగ్నంగా నిలబెట్టి గుంజీలు తీయించారు ఇతర ఖైదీలు. నిందితులు గుంజీలు తీస్తుండగా ఖైదీలు చప్పట్లు కొడుతూ…ఉత్సాహపరించేందుకు ప్రయత్నించారు. గోవాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న జైలు ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. జైలు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
Read More : Y.S.Viveka Murder: వివేకా హత్యకేసు.. హైడ్రామా మధ్య ఆయుధాల స్వాధీనం!
గోవా బీచ్ లో ఇటీవలే ఇద్దరు యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం గోవా జైలుకు తరలించారు. అయితే..అరెస్టు అయిన ఒక నిందితుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని ప్రత్యేక బ్లాక్ లో ఉంచారు. సాధారణ జైలు వార్డులో మిగతా ముగ్గురు నిందితులను ఉంచారు. అందులో ఉన్న ఇతర ఖైదీలు వారి దుస్తులు విప్పించి నగ్నంగా గుంజీలు తీయించారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త కలకలం రేపుతోంది. దర్యాప్తు జరిపి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని జైలు ఐజీ వైనాన్సియో ఫుర్టాడో ఆదేశించారు. జైలు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, జైలు సిబ్బంది పాత్ర ఉందా ? లేదా ? అనే దానిపై దర్యాప్తు జరుపుతామన్నారు.