Hetiro Pharma
Income Tax department searches : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ విభాగం ఉచ్చు బిగుస్తోంది. హెటిరో కార్యాలయాల్లో రెండోరోజులుగా సోదాలు కొనసాగిస్తోంది. హైదరాబాద్‌తో పాటు మరో మూడు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు… సోదాలు నిర్వహిస్తున్నారు. హెటిరో ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి. నిన్న మొదలైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని హెటిరో హెడ్ ఆఫీస్‌తోపాటు విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఉన్న కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు. జొన్నల సంబిరెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథిరెడ్డితోపాటు వారి పార్ట్ నర్ ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Srikrishna Jewelers : భారీ గోల్డ్ స్కామ్ కేసు…హైదరాబాద్ శ్రీకృష్ణ జువెలర్స్ లో ఈడీ సోదాలు
నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేసిన ఐటీ అధికారులు… కోవిడ్ సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించారు. మొత్తం 20 బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి.