Income Tax Raids : హైదరాబాద్ లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు

ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

income tax raids

Income Tax Raids :  ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 45,  నానక్ రాం గూడ లో ఉన్న కార్యాలయాలతో  పాటు దాదాపు 20 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఫీనిక్స్  కార్పోరేట్ ఆఫీసుతో పాటు దానికి సంబంధించిన అనుబంధ కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఫీనిక్స్ అధినేత చుక్కపల్లి సురేష్ కు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీనిక్స్ సంస్ధ  హైదరాబాద్ లో పలు నిర్మాణాలు చేపడుతోంది.  పన్ను ఎగవేతలపై  ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : Bike Theft : పోలీసు స్టేషన్ ముందే కానిస్టేబుల్ బైక్ కొట్టేసిన దొంగ