Assembly Interesting Events : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన సంఘటనలు

చివరి రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. దీంతో ఈటలపై కేసీఆర్ వైఖరి మారిందా అనే చర్చ జోరందుకుంది.

ETALA-KCR

Assembly Interesting Events : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. దీంతో ఈటలపై కేసీఆర్ వైఖరి మారిందా అనే చర్చ జోరందుకుంది. ఈటల సలహాలు తీసుకోవాలని మంత్రులకు సూచించడంతో సభలో ఘర్ వాపస్ అంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

అయితే ఘర్ వాపస్ నినాదాలపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ పిలిచినా బీఆర్ఎస్ లోకి రానని అన్నారు. పదే పదే పార్టీలు మారే వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చారు. అటు కేసీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ సైతం స్పందించారు. బీజేపీని చూసి కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. మిత్రుడు ఈటల అంటూ పదే పదే బీజేపీ ఎమ్మెల్యే పేరును సీఎం కేసీఆర్ హైలైట్ చేశారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ఈటల, మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం..

సంక్షేమ పథకాల రూపకల్పన సమయం నుంచి కేంద్ర వైఖరి వరకు ప్రతి అంశంలోనూ ఈటలను హైలైట్ చేస్తూ.. ఆయన పేరును సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల మిత్రుడు ఈటల నుంచి మా ఈటల అని కేసీఆర్ అన్నారు. ఇంతముందు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కూడా బీజేపీ ప్రస్తావనే రాగానే ఈటల రాజేందర్ అంటూ మాట్లాడారు. కేంద్రం, మోదీని విమర్శించారు.