Telangana : డ్రెస్సింగ్ బాగాలేదంటూ..విద్యార్ధి తల గోడకేసి కొట్టిన లెక్చరర్
డ్రెస్సింగ్ బాగాలేదంటూ..విద్యార్ధి తల గోడకేసి కొట్టాడు లెక్చరర్. దీంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది.

Intermediate Student For Not Maintaining Proper Dress Code Lecturer Hiting
Bhadradri Kothagudem : కొత్తగూడెం జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్ధులకు మంచి..చెడులు నేర్పాల్సిన లెక్చరర్ విచక్షణ మరచిపోయాడు. ఓ విద్యార్థి ధరించిన డ్రెస్ బాగాలేదు..ఇలాంటి డ్రెస్ కాలేజీకి వేసుకొస్తావా?అంటూ దారుణంగా కొట్టాడు. దీంతో సదరు విద్యార్థి తల గోడకు తగలటంతో అతని చిన్నమెదడి వాచింది అని డాక్టర్లు చెప్పటంతో తల్లి తల్లడిల్లిపోతోంది. నా బిడ్డను ఇంత దారుణంగా కొట్టిన లెక్చరర్ రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
లెక్చరర్ రాంబాబ దురుసు ప్రవర్తన విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గురుకుల పాఠశాలలో డ్రెస్సింగ్ సరిగాలేదంటూ ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి కార్తీక్‌పై ఫిజిక్స్ లెక్చరర్ రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. కార్తీక్ తలను గోడకేసి కొట్టాడు. దీంతో విద్యార్థి పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉందని..కార్తీక్ చిన్న మెదడు వాచింది అని..సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్ తెలిపారు. తన బిడ్డను దారుణంగా కొట్టిన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లి డిమాండ్ చేసింది.