BJP : తెలంగాణ బీజేపీలో బయటపడ్డ అంతర్గత విభేదాలు

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజీపీ నేత పేరాల శేఖర్‌రావు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు సంఘ్‌ పరివార్‌కు బహిరంగ లేఖ రాశారు.

Bjp (1)

Internal differences in BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజీపీ నేత పేరాల శేఖర్‌రావు రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు సంఘ్‌ పరివార్‌కు బహిరంగ లేఖ రాశారు. పార్టీలో తనను బలి పశువును చేశారంటూ ఆ లేఖలో వాపోయారు. లింగోజిగూడ కార్పొరేటర్ ఎన్నిక విషయంలో తాను ప్రగతిభవన్‌కు వెళ్లినపుడు ఏం జరిగిందో లేఖలో వివరించారు.

అంతేకాదు.. పార్టీలో టీమ్‌ స్పిరిట్ కొరవడిందని, వ్యక్తిగతంగాగానీ మీటింగ్‌లోగాని స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అందరిలా లోపాయకారీ వ్యవహారాలు తాను చేయలేనని పేరాల అన్నారు. అలాంటి ఆధారాలేవైనా ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.