International Women’S Day : హైదరాబాద్ పోలీస్ చరిత్రలో మొదటిసారిగా మహిళా సీఐకి SHO గా బాధ్యతలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సీఐకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ నగర పోలీస్ చరిత్రలోనే మొదటిసారి మహిళా సీఐ మధులత SHOగా బాధ్యతలు

Hyderabad Police First Women Sho Madhulatha

hyderabad police first women sho madhulatha : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా పోలీసుకు అంత్యంత అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ నగర పోలీస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత SHO (Station house officer) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలో ఓ మహిళా పోలీసు అధికారి SHOగా చేసిన చరిత్రలేకపోవటం అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఐ మధులతకు దక్కటం విశేషం. తెలంగాణ పోలీస్ శాఖ మధులతకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులతకి ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలు అప్పగించారు హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ SHO గా బాధ్యతలు స్వీకరించారు మధులత.

2002 బ్యాచ్ కు చెందిన మధులత సౌత్ జోన్ పాతబస్తీ ఉమెన్ పోలీస్ స్టేషన్ సీఐగా, ఎస్ బీ వింగ్ సీఐగా గతంలో విధులు నిర్వహించారు మధులత. మహిళా సీఐ మధులత పేరును ఓ సీల్డ్ కవర్ లో ఉంచి మంగళవారం (మార్చి 8,2022) అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సర్ప్రైజ్ గా అందించారు.