PM Modi Public Meeting
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఏకంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. స్వయంగా ఆయనే తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈసారి తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని విశ్వాసం వ్యక్తం చేశారు మోదీ.
కాగా, ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రధాని మోదీ పవన్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. సభా వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మధ్యమధ్యలో పవన్ తో ముచ్చటించారు. పలు అంశాలపై వేదికపైనే చర్చించారు. పవన్ ను ఎంతో అపాయ్యంగా పలకరించారు మోదీ. సొంత పార్టీ నేతలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.. అంతకన్నా ఎక్కువే ప్రాధాన్యత పవన్ కు మోదీ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : బీజేపీ సభలో ఇంట్రస్టింగ్ సీన్.. పక్కపక్కనే ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్.. పవన్‌తో ఏం మాట్లాడారు?
ఇక, ఈ సభలో మరో ఇంట్రస్టింగ్ సీన్ ఏంటంటే.. ప్రధాని మోదీ ఓ జీపులో గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. మోదీ ఎంట్రీ మామూలుగా లేదనే చెప్పాలి. అడుగడుగునా పూల వాన కురిపించారు. ఇక, ఆ జీపులో ప్రధానితో పాటు ఎవరెవరు ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ జీపులో ప్రధాని మోదీతో పాటు ముగ్గురు బీజేపీ నాయకులు ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరెవరు అంటే.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్. ఈ ముగ్గురు ప్రధాని మోదీ పక్కపక్కనే జీపులో కనిపించారు. ప్రధాని మోదీకి ఒకవైపున కిషన్ రెడ్డి ఉంటే మరోవైపు ఈటల రాజేందర్ నిల్చున్నారు. ప్రధానికి వెనకాల బండి సంజయ్ ఉన్నారు. ఈ ముగ్గురు బీజేపీలో కీలక నేతలుగా ఉన్నారు.
కాగా ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందు నుంచి పార్టీలో ఉన్న తనకన్నా.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటలకు, ఆయన వర్గానికే బీజేపీ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చిందని, అలాంటి తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించడాన్ని బండి సంజయ్ తట్టుకోలేకపోయారు. సొంత పార్టీలోని వారే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ పక్కపక్కనే కిషన్ రెడ్డి, ఈటలతో పాటు బండి సంజయ్ కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది?