తెలంగాణ డీజీపీగా జితేందర్.. ఎవరీ జితేందర్, పూర్తి వివరాలు..

తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Telangana DGP Jitender : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ ను నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోమ్ శాఖ స్పెషల్ సీఎస్ గా(చీఫ్ సెక్రటరీ) బదిలీ చేసింది ప్రభుత్వం. 1992 క్యాడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ జితేందర్ ను తెలంగాణ డీజీపీగా నియమించారు. ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిజిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు జితేందర్. పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు జితేందర్‌. నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా మొదట విధులు నిర్వర్తించారు. 2025 సెప్టెంబర్ లో పదవీ విరమణ చేయనున్నారు. డీజీపీగా ఆయన 14 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్.. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి అవకాశం తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షిస్తామని చెప్పారు. నార్కోటిక్, సైబర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నార్కోటిక్ బ్యూరోకు ఇటీవల వాహనాలు కూడా ఇచ్చారని డీజీపీ జితేందర్ తెలిపారు.

Also Read : భయమా, అనుమానమా.. చంద్రబాబు, రేవంత్ భేటీపై కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం ఎందుకు?