Telangana Caste Census: సీఎం రేవంత్ సీరియస్.. అవన్నీ ముందే బయటకు ఎలా వెళ్లాయ్..!

కులగణన నివేదిక వివరాలను మంత్రులు ఇప్పటికే బయటపెట్టేశారు.

Cm Revanth Reddy

కులగణన నివేదిక వివరాల వెల్లడిపై తెలంగాణ సీఎం రేవంత్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. క్యాబినెట్‌లో చర్చించకుండా నివేదిక వివరాల వెల్లడిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

అందుకే ఇవాళ ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలను క్యాబినెట్‌ సబ్‌ కమిటీ గోప్యంగా ఉంచుతోంది. మంత్రులు అర్థాంతరంగా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. రేపు క్యాబినెట్ ముందుకు వచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా, రాష్ట్రంలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతంగా ఉండగా, ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతంగా ఉంది. ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం అని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

బీసీల జనాభా 46.25 శాతంగా ఉండగా, ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉందని వివరించింది. ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08 శాతంగా ఉందని చెప్పింది. ఎస్టీల జనాభా 10.45 శాతంగా, ఎస్సీల జనాభా 17.43 శాతంగా ఉందని వివరించింది.

కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ కోసం రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిపై ఇప్పటికే శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సమావేశాలకు ముందు రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సమావేశం జరుగుతుంది.

Also Read: భార్య చెల్లెలిపై అతి దారుణానికి పాల్పడ్డ వ్యక్తి.. లోన్‌ తీసుకుని మరీ రౌడీలను రప్పించి ఏమేం చేశాడో తెలుసా?