jagadish reddy
Jubilee Hills Bypoll 2025: సొంత అన్న కూతురి పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన భార్య ఎందుకు పోలేదో చెప్పాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. మాగంటి గోపీనాథ్ కుటుంబం గురించి రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జగదీశ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నించిన వారిని విమర్శిస్తూ రేవంత్ చేతకాని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కుర్చీ నుంచి రేవంత్ రెడ్డి దిగిపోయి ఆర్.కృష్ణయ్య లేదా మంద కృష్ణమాదిగకు అప్పగించాలని చెప్పారు. (Jubilee Hills Bypoll 2025)
సీఎం కుర్చీని ఇంకెవరికి ఇచ్చినా రేవంత్ రెడ్డి కంటే మంచిగా పాలన చేస్తారని జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ రెడీగా ఉన్నారని చెప్పారు.
Also Read: RCB తరఫున బరిలోకి ట్రాన్స్ మహిళా క్రికెటర్..! సర్జరీ చేయించుకుని “ఆమె”గా మారిన “అతడు” ఎవరో కాదు..
“జూబ్లీహిల్స్‌లో ఓడితే ముఖ్యమైన కుర్చీకి ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్ కోసం.. రేవంత్ సర్పంచ్ ఎన్నికలకు తిరిగినట్లు తిరుగుతున్నారు. ప్రెస్ క్లబ్ రేవంత్ రెడ్డికి పబ్ మాదిరిగా కనిపించింది.
అందుకే స్టార్ హోటల్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం పెట్టుకున్నారు. కేసీఆర్ పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 24 గంటల ఉచిత కరెంట్, ఇంటింటికి మంచి నీటిని దేశంలో కేసీఆర్ మాత్రమే ఇచ్చారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకోవటం సిగ్గు చేటు.
చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాలనపై రేవంత్ రెడ్డి ప్రశంసలు హాస్యాస్పదం. పీజేఆర్‌ను చంపిందే కాంగ్రెస్ పార్టీ. పీజేఆర్ కుటుంబానికి రాజకీయాల్లో స్థానం లేకుండా చేసిందే రేవంత్ రెడ్డి. అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకుకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? 2004 నుంచి 2014 వరకు శ్మశానానికి స్వర్ణయుగం.
చంద్రబాబు హయాంలో సొంత జిల్లా పాలమూరులో ఆకలి చావులను రేవంత్ మర్చిపోయారా? నల్గొండ జిల్లాకు ఫ్లోరైడ్ తెచ్చింది ఎవరు? రేవంత్ చెప్పాలి. 1000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది దేశంలో కేసీఆర్ మాత్రమే.
తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిందే కేసీఆర్, కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు వస్తోన్న జనాల్ని చూసి.. రేవంత్ కు మైండ్ పోతోంది. ఐటం సాంగ్స్ మాత్రమే రేవంత్ రెడ్డికి గుర్తుంటాయి” అని అన్నారు.