దామోదర రాజనర్సింహ, నేను కలిసి బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించాం: జగ్గారెడ్డి

మంత్రి దామోదర రాజనర్సింహ, తాను కలిసి మూడేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు.

దామోదర రాజనర్సింహ, నేను కలిసి బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించాం: జగ్గారెడ్డి

Jagga reddy interesting comments on Damodar Raja Narasimha in sangareddy

Jagga Reddy: మంత్రి దామోదర రాజనర్సింహ, తాను కలిసి మూడేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించామని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యనించారు. మంత్రి రాజనర్సింహ, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి చిట్ చాట్ చేశారు. ”మెడికల్ కాలేజీ కోసం నేను, దామన్న అనేక పోరాటాలు చేశాం. మా ఇద్దరి పోరాటం వల్లే సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చింది. మూడేళ్లు మేమిద్దరం BRSకి చుక్కలు చూపించాం. దామన్నే ఇప్పుడు హెల్త్ మినిస్టర్ కావడం ఇంకా సంతోషమ”ని జగ్గారెడ్డి అన్నారు.

విద్యార్థుల ఫిర్యాదు.. అధికారులపై మంత్రి సీరియస్
సంగారెడ్డి వైద్య కళాశాలలో హాస్టల్ సౌకర్యాలు లేవని, ఆడిటోరియం లేదని మంత్రి దామోదర రాజనర్సింహకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదని సీరియస్ అయ్యారు. ఎందుకింత నిర్లక్ష్యం, పని చేయలేకపోతే వెళ్లిపోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.

Also Read : సై అంటే సై అంటున్న సీనియర్లు..! హస్తం పార్టీలో హీట్ పుట్టిస్తున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికలు

ప్రైవేటు ఆసుపత్రుల్లో మోసాలను అరికడతాం
అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు. సంగారెడ్డికి మరో ఐదు వందల పడకల ఆసుపత్రి అవసరం ఉందని, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు మంచి సేవలు అందించాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వ దావఖానాల్లో సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న మోసాలను అరికడతామని, 2011 వైద్య చట్టాన్ని పకడ్భందీగా అమలుచేస్తామన్నారు. వైద్యసేవలకు సంబంధించి ధరల పట్టికను ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డిలో ఆయుష్ ఆసుపత్రిని సెప్టెంబర్ లో ప్రారంభిస్తామని, ఏడాదిలో శాశ్వత భవనాలు నిర్మిస్తామని హామీయిచ్చారు.