Jagga Reddy: బీఆర్ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారంపై జగ్గారెడ్డి ఏమన్నారంటే?

తాను కాంగ్రెస్‌లో ఉండకూడదని కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో..

Jagga Reddy

Jagga Reddy- Congress: కాంగ్రెస్ నేత, తెలంగాణలోని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగస్టు 23న బీఆర్​ఎస్(BRS)​లో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి.

దీనిపై ఇవాళ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌లో ఉండకూడదని కొందరు ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏడాదిన్నరగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వాళ్ల ఆనందమేంటో తనకు అర్థం కావట్లేదని జగ్గారెడ్డి అన్నారు.

భారత్ జోడో యాత్రకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశానని చెప్పారు. పాదయాత్రలో ఏర్పాట్లను చూసి రాహుల్ గాంధీ కూడా తనను మెచ్చుకున్నారని అన్నారు. జోడో యాత్ర ముగిసిన పది రోజులకే మళ్లీ తనపై దుష్ప్రచారం చేశారని తెలిపారు.

తనను బద్నాం చేయడానికి వారికి ఎవరు డబ్బు ఇస్తున్నారని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ సమావేశాలకు కూడా జగ్గారెడ్డి హాజరుకావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇక జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరడమే తరువాయి అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Elections 2023: ఈ నెల 26న మరో డిక్లరేషన్.. మేనిఫెస్టో విడుదల కోసం సోనియాను ఆహ్వానిద్దామన్న రేవంత్