Jagtial 3 Murder: జగిత్యాల మూడు హత్యలపై కొనసాగుతున్న విచారణ, ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్

నాగేశ్వరరావు అతని ముగ్గురు కుమారులపై కత్తులు, బరిశెలతో ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేశారు. మంత్రాల నెపంతో నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యలు చేసినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.

Jagtial 3 Murder: జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకున్న మూడు హత్యలపై పోలీసులు ముమ్మర విచారణ చేపడుతున్నారు. ఘటనకు సంబంధించి ఈఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. . పాత పగలు,మూఢనమ్మకాల నేపథ్యంలో ముగ్గురు తండ్రి కొడుకులను ప్రత్యర్ధులు నరికి చంపిన దారుణ ఘటనలో పలు విషయాలు వెల్లడయ్యాయి. హత్యగావించబడ్డ తండ్రి కొడుకులు నాగేశ్వరరావు, రాంబాబు, రమేష్ లు గత కొంతకాలంగా మంత్ర విద్యలతో పలువురి చావుకు, మరికొందరి అనారోగ్యానికి కారణమయ్యారంటూ కుల సభ్యులు ఆరోపించారు.

Also read: Flight U turn: ప్రయాణికురాలు మాస్క్ ధరించలేదని “యూ టర్న్” తీసుకున్న విమానం

జగిత్యాల జిల్లా ఎరుకలవాడలో నివాసముంటున్న నాగేశ్వరరావు.. తమ కుల పెద్దగా వ్యవహరిస్తున్నాడు. నాగేశ్వరరావుకు రాంబాబు, రమేష్, రాజేష్. ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే వీరంతా గత కొంత కాలంగా కులంలో పెత్తనం చెలాయిస్తున్నారని..కొందరు ప్రత్యర్ధులు వీరితో వైరం పెంచుకున్నారు. అదే సమయంలో గ్రామంలో కొందరు అనుమానాస్పదంగా మృతి చెందారు. నాగేశ్వరరావు తన కొడుకులతో కలిసి మంత్రాలతో ఆ మరణాలకు కారణమయ్యారంటూ ఆరోపించిన ప్రత్యర్ధులు, ఆమేరకు వారిని మట్టుపెట్టేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు.

Also read: AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. 32 అంశాలతో కేబినెట్ అజెండా..!

ఈక్రమంలోనే గురువారం కుల సమావేశానికి వచ్చిన నాగేశ్వరరావు అతని ముగ్గురు కుమారులపై కత్తులు, బరిశెలతో ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేశారు. 60 మంది చూస్తుండగానే పట్టపగలు ఈఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థుల దాడిలో నాగేశ్వరరావు, అతని ఇద్దరి కుమారులు రాంబాబు, రమేష్ మృతి చెందగా.. మరొక కుమారుడు రాజేష్ తప్పించుకున్నాడు. ఇక ఈఘటనకు సంబంధించి వనం దుర్గయ్య, చిన గంగయ్య, మధు పోచయ్య, శేఖర్, కందుల రాములు, కందుల శ్రీను, పల్లాని భూమయ్యలను పోలీసులు విచారిస్తున్నారు. మంత్రాల నెపంతో నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా ఈ హత్యలు చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

Also read: Statue of Equality: సమతామూర్తి విగ్రహ ఆవిష్కారానికి ఏర్పాట్లు.. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాక

ట్రెండింగ్ వార్తలు