AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. 32 అంశాలతో కేబినెట్ అజెండా..!

ఏపీ కేబినెట్ మళ్లీ భేటీ కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. పీఆర్సీ వేతన సవరణ, ఉద్యోగుల ఆందోళనలపై చర్చించే అవకాశం ఉంది.

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. 32 అంశాలతో కేబినెట్ అజెండా..!

Ap Cabinet

AP Cabinet :  ఏపీ కేబినెట్ మళ్లీ భేటీ కానుంది. శుక్రవారం (జనవరి 21) ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. పీఆర్సీ వేతన సవరణ, ఉద్యోగుల ఆందోళనలపై చర్చించే అవకాశం ఉంది. కరోనా థర్డ్‌ వేవ్‌, ఒమిక్రాన్‌ కట్టడి చర్యలపై కార్యాచరణపై చర్చించనున్నారు. మొత్తం 32 అంశాలతో కేబినెట్ అజెండా నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు కనిపిస్తోంది. రైతులకు విత్తన, ఎరువుల సరఫరా కోసం ఈ-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా మంత్రి వర్గం చర్చించే అవకాశం ఉంది. ఇంధన శాఖకు సంభందించి మరో రెండు అంశాలను చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఏపీలో ప్రధాన ఇష్యూగా మారిన సినిమా టికెట్ల ధరలు అంశంపై కూడ ఏపీ కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై మంత్రులు స్పందించారు. ఉద్యోగులు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేశారు మంత్రి పేర్ని నాని. ఎవరో చెప్పిన మాటలు విని సమ్మెకు వెళ్లొద్దని కోరారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల్ని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. మరోసారి ఉద్యోగులు, ప్రభుత్వం కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఉద్యోగ సంఘాలతో మాట్లాడే ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని సున్నితంగానే చూస్తామని, వ్యక్తిగతంగా తీసుకుని ఏ కార్యక్రమాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీపై ఉద్యోగులు ఆందోళన చేయడం సరికాదన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌.

సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారన్నారు. అప్పుడు అన్నింటికీ అంగీకరించి… ఇప్పుడు ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. ఉద్యోగులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కచ్చితంగా చర్చలు జరుపుతుందన్నారు.

Read Also : Police Dance : పోలీసుల సరదా.. ఉద్యోగానికే ఎసరు తెచ్చింది..!