South Central Railway
Medaram Jathara 2024 : తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతర ఈనెల 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ జాతరకు దక్షిణ మధ్య రైల్వే జన్ సాధారణ్ రైళ్లను నడపుంది. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ 10టీవీతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 30 స్పెషల్ రైళ్లు నడుపుతున్నామని అన్నారు. గతంలో జాతరకు రాష్ట్రంలోని రెండు చోట్ల నుంచి మాత్రమే స్పెషల్ రైల్ సర్వీసులను నడిపడం జరిగిందని, ఈ సంవత్సరం జన్ సాధారణ్ రైళ్లు సికింద్రాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ మరియు సిర్పూర్ కాగజ్‌నగర్ మొదలయిన ఐదు ప్రాంతాల నుండి నడుస్తాయని చెప్పారు. ఈ రైళ్లు మార్గంలోని అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రాకేష్ చెప్పారు.
Also Read : Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
జాతర సందర్భంగా నడిపే రైళ్లలో అన్ రిజర్వుడు బోగీలే ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్వో రాకేష్ చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం జన్ సాధారణ్ రైళ్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ స్పెషల్ రైళ్లతోపాటు రెగ్యూలర్ గా నడిచే రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర కాబట్టి.. ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.
Also Read : BJP MP Laxman : బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు.. తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు