Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..

మేడారం జాతర సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఎనిమిది రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి..

Medaram Jatara 2024 : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..

Medaram Jatara

TS RTC : తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం జాతర రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగు రోజులపాటు జరుగుతుంది. ఈ జాతరకు ప్రపంచ వ్యాప్తంగా కోటిమందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళా తరువాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందిన ఈ సంబరం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతుంది. ఈ జాతరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 21 నుంచి జాతర ప్రారంభం కానుండగా.. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

Also Read : Medaram jatara : సీపీఆర్ చేసి వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. మేడారం జాత‌ర‌లో ఘ‌ట‌న..

మేడారం జాతర సందర్భంగా భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆరువేల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 15వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధుల్లో పాల్గోనున్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ తో కూడిన బేస్ క్యాంపును టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. బేస్ క్యాంప్ లో 7కిలో మీటర్ల పొడవునా 50 క్యూలైన్లను నిర్మాణం చేశారు. మేడారం జాతరకు వెళ్లే తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణంచేసే వారికి తల్లులను దర్శించుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. 30లక్షల మందికిపైగా ప్రయాణికులను టీఎస్ ఆర్టీసీ బస్సుల ద్వారా మేడారం చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Also Read : Medaram Jatara 2024: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు మంజూరు చేశారు: మంత్రి సీతక్క

ఇదిలాఉంటే.. సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన టీఎస్ ఆర్టీసీ బేస్ క్యాంపును మంత్రి సీతక్క రెండురోజుల క్రితం ప్రారంభించారు. తిరుగుప్రయాణంలో భక్తులు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు.