Medaram jatara : సీపీఆర్ చేసి వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. మేడారం జాత‌ర‌లో ఘ‌ట‌న..

ఓ కానిస్టేబుల్ స‌మ‌య‌స్పూర్ఫితో వ్య‌వ‌హ‌రించి సీపీఆర్ చేసి వ్య‌క్తి ప్రాణాల‌ను నిల‌బెట్టాడు.

Medaram jatara : సీపీఆర్ చేసి వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. మేడారం జాత‌ర‌లో ఘ‌ట‌న..

Police Constable Saves a man life in Medaram jatara by doing cpr

మేడారం జాత‌ర‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తికి హ‌ఠాత్తుగా గుండెపోటు వ‌చ్చింది. దీంతో అత‌డు కుప్ప‌కూలిపోయాడు. ఓ కానిస్టేబుల్ స‌మ‌య‌స్పూర్ఫితో వ్య‌వ‌హ‌రించి సీపీఆర్ చేసి స‌ద‌రు వ్య‌క్తి ప్రాణాల‌ను నిల‌బెట్టాడు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పాకాలగూడెం గ్రామానికి చెందిన తోట నాగ‌ముత్యం కానిస్టేబుల్‌గా ప‌ని చేస్తున్నాడు. ఇత‌డు ద‌మ్మాపేట పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. విధుల్లో భాగంగా అత‌డికి మేడారం జాత‌ర‌లో డ్యూటీ ప‌డింది.

ఓ వ్య‌క్తి త‌న కుటుంబంతో క‌లిసి మేడారం జాత‌ర‌కు వ‌చ్చాడు. అమ్మ‌వార్ల‌ని ద‌ర్శించుకున్నాడు. తిరిగి న‌డుచుకుంటూ వెలుతుండ‌గా ఆక‌స్మాత్తుగా కింద‌ప‌డిపోయాడు. అత‌డిలో చ‌ల‌నం లేదు. ఏం జ‌రిగింద‌నే విష‌యం చుట్టు ప‌క్క‌ల వారికి అర్థం కాలేదు. కుటుంబ స‌భ్యులు కంగారు ప‌డిపోయారు. అక్క‌డ‌కు ద‌గ్గ‌ర‌లోనే విధులు నిర్వ‌ర్తిస్తున్న కానిస్టేబుల్ నాగ‌ముత్యం వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్నాడు.

BJP : పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడు పెంచిన బీజేపీ.. రాష్ట్ర వ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌ల‌కు ప్లాన్‌

స‌ద‌రు వ్య‌క్తి గుండెపోటుకు గురి అయ్యాడ‌ని గ్ర‌హించారు. వెంట‌నే సీపీఆర్ చేశాడు. కొద్దిసేప‌టికి అత‌డు కోలుకున్నాడు. ఆ త‌రువాత అత‌డిని ద‌గ్గ‌ర‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ నాగ‌ముత్యం ను అంద‌రూ ప్ర‌శంసించారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు కానిస్టేబుల్‌ను అభినందిస్తున్నారు.