Janardhan Reddy : TSPSC ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేసేశారు.

TSPSC chairman Janardhan Reddy resigns

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్ సీ) ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆయన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కి పంపారు. గవర్నర్ ఆ రాజీనామా ఆమోదించి సీఎస్ కు పంపారు. టీఎస్ పీఎస్ సీ బోర్డు తీరు తీవ్ర వివాదాస్పదమైంది. అనేక వివాదాలకు దారితీసింది. ఈ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల పేపర్లు లీక్ అవడం, వాయిదా పడటం వంటివి నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టించాయి. బోర్డు పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది.

Also Read : TSPSCపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(డిసెంబర్ 11) టీఎస్ పీఎస్ సీ పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు.. ఇలాంటి అంశాలకు సంబంధించి 2 రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని జనార్దన్ రెడ్డిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే, సీఎంతో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేసేశారు. 2021 మే 19న TSPSC ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు జనార్దన్ రెడ్డి.

 

ట్రెండింగ్ వార్తలు