CM Revanth Reddy : TSPSCపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి కీలక ఆదేశాలు

టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.

CM Revanth Reddy : TSPSCపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి కీలక ఆదేశాలు

CM Revanth Reddy Special Focus On TSPSC

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పై ఫోకస్ పెట్టారు. టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

Also Read : యశోద ఆస్పత్రిలో ఆసక్తికర ఘటన.. రేవంత్ అన్న అంటూ పిలిచిన మహిళ.. సీఎం ఏం చేశారంటే.. వీడియో వైరల్

టీఎస్ పీఎస్ సీ వ్యవహారం.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక గట్టి సవాల్ గా మారిందని చెప్పుకోవచ్చు. పేపర్ లీకేజీలు, సరిగా పరీక్షలు నిర్వహించకపోవడం, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం.. ఇవన్నీ కూడా టీఎస్ పీఎస్ సీ వైఫల్యంతోనే జరిగాయి అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో టీఎస్ పీఎస్ సీపైన సమీక్ష నిర్వహించారు. ఛైర్మన్ జనార్ధన్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Also Read : ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో టీఎస్ పీఎస్ సీ భర్తీ చేసిన ఉద్యోగాలు ఏంటి? ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటి? ఎందుకు ఉద్యోగాల భర్తీ జరగలేదు? ఇలాంటి పూర్తి వివరాలతో తన ముందుకు రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ కు ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఉద్యోగాల భర్తీని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుంది అనేదానిపై నిరుద్యోగులు చూస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లు వేయాలన్నా, కొత్త ఉద్యోగాలు భర్తీ చేయాలన్నా టీఎస్ పీఎస్ సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు అని చెప్పొచ్చు.