Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు కారణాలు ఏమిటనే చర్చ ఏపీ రాజకీయ వర్గాలో జోరుగా సాగుతోంది.

Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణాలు అవేనా..? ఏదైనా వ్యూహం ఉందా

Alla Ramakrishna Reddy

Ramakrishna Reddy Resign : మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ పార్మాట్ లో రాజీనామా లేఖను ఓఎస్డీకి అందజేశారు. మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ముఖ్యఅనుచరుడిగా పేరున్న ఆళ్ల రాజీనామా ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఆళ్ల రాజీనామాపై వైసీపీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రాజీనామా ప్రకటన అనంతరం ఆళ్ల మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు గల కారణాలను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఇన్నిరోజులు అవకాశం కల్పించిన సీఎం జగన్ కు ఆళ్ల ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

రాజీనామాకు అసలు కారణాలు ఇవేనా?
వైసీపీ కీలక నేతగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాకు అసలు కారణం ఏమిటనే చర్చ ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ యువత నేత నారా లోకేశ్ పై మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఆళ్ల విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయం పట్ల ఆళ్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. జగన్ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అయితే, కొంతకాలంగా పార్టీ తీరుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని పలు సందర్భాల్లో వైసీపీ నేతల వద్ద అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. దీనికితోడు నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తడంతోపాటు.. ఆర్కేకు పోటీగా వైసీపీ నేత దొంతి వేమారెడ్డి పార్టీ కార్యాలయాన్నితెరవడం, దీనికితోడు మంగళగిరి నియోజకవర్గానికి చిరంజీవిని కొత్త ఇంఛార్జ్ గా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర మనస్థాపానికిలోనైన ఆళ్ల.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేసినట్లు తెలుస్తోంది.

Also Read : Cyclone Threat : ఏపీకి మరో తుఫాన్ గండం.. మిచాంగ్ బీభత్సం నుంచి కోలుకోకముందే!

ఏదైనా వ్యూహం ఉందా?
కొద్దికాలంగా  వైసీపీలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి భావించినట్లు తెలుస్తోంది. పలుసార్లు వైసీపీ పెద్దల వద్ద ఈ విషయాలను ప్రస్తావించినప్పటికీ ఆళ్లకు ఎలాంటి మద్దతు లభించలేదన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. దీంతో తొలుత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆళ్ల నిర్ణయించుకున్నారని, కానీ, నియోజకవర్గంలో పార్టీలో తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీని, ఎమ్మెల్యే పదవిని వీడడమే సరైన మార్గమని ఆళ్ల నిర్ణయించుకొని, రాజీనామా చేశారని సమాచారం. అయితే, తన రాజీనామాకు కారణాలను ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించక పోవటంతో ఆయన రాజీనామా వెనుక ఏదైనా వ్యూహం ఉందాఅన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతుంది.