Janasena
Jana Sena Telangana : జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కసరత్తు మొదలుపెట్టారు. ఏపీతో పాటు, తెలంగాణలోనూ క్రియాశీల పాత్ర పోషించేందుకు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా ఏళ్ళ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా జనసేన భవిష్యత్, క్రియాశీలక సభ్యుల నియామకం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సమావేశం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని జె.పి.ఎల్. కన్వెన్షన్‌లో సమావేశం జరగనుంది.
Read More : Kerala : కేరళలో తగ్గని కోవిడ్ ఉధృతి..కొత్తగా 11వేల కేసులు,120 మరణాలు
మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ మీటింగ్‌లో పవన్ కీలక ఉపన్యాసం చేయబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా తెలంగాణలో పార్టీపై దృష్టి సారించని పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం, హాట్ టాపిక్‌గా మారింది. ఓ నెలలో కొన్ని రోజులపాటు తెలంగాణాలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Read More : vaccine mandate For Employees : వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీసులోకి అనుమతి..ఢిల్లీ సర్కార్ ఆదేశాలు
అందులో భాగంగా 2021, అక్టోబర్ 09వ తేదీ శనివారం మీటింగ్ జరగనుంది. పార్టీ పెట్టిన మొదట్లో తెలంగాణలో అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించిన పవన్…2019 ఎన్నికల తర్వాత అంతగా ఫోకస్ చేయలేకపోయారు. అయితే ఏపీలో యాక్టీవ్‌గా ఉంటూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఢీ అంటే ఢీ అంటున్నారు. అయితే తెలంగాణలో పార్టీ కీలకంగా వ్యవహరించేలా ప్లాన్ చేస్తున్నారు పవన్.