Telangana : దారుణం.. నిద్రిస్తున్న భర్తపై మరిగే నూనె పోసిన భార్య.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Telangana : జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Telangana : జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. మరిగే నూనెను తన భర్తపై పోసింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన భర్త.. చికిత్స పొందుతూ మరణించాడు.

Also Read: Rajasthan : భర్తతో విడిపోయింది.. ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తితో ప్రేమాయణం.. పెళ్లికోసం 600 కి.మీ జర్నీ.. చివరికి కారులో డెడ్‌బాడీ ..

మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్, పద్మలకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు గ్రామంలోని పెద్ద మనుషులు వారి మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే, ఈనెల 10వ తేదీన రాత్రి భార్య పద్మను వెంకటేశ్ కొట్టాడు. ఆగ్రహంతో ఊగిపోయిన పద్మ.. 11వ తేదీ తెల్లవారుజామున నిద్రిస్తున్న భర్త వెంకటేశ్ పై మరిగే నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలైన పాలైన వెంకటేశ్ ను కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను సోమవారం సాయంత్రం మరణించాడు.

వెంకటేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య పద్మను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.