Rajasthan : భర్తతో విడిపోయింది.. ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తితో ప్రేమాయణం.. పెళ్లికోసం 600 కి.మీ జర్నీ.. చివరికి కారులో డెడ్‌బాడీ ..

Rajasthan : ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు 600 కిలోమీటర్లు జర్నీచేసి వెళ్లిన మహిళ తన కారులోనే చనిపోయింది.

Rajasthan : భర్తతో విడిపోయింది.. ఫేస్‌బుక్‌లో మరో వ్యక్తితో ప్రేమాయణం.. పెళ్లికోసం 600 కి.మీ జర్నీ.. చివరికి కారులో డెడ్‌బాడీ ..

Rajasthan

Updated On : September 16, 2025 / 8:49 AM IST

Rajasthan : రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు 600 కిలోమీటర్లు జర్నీచేసి వెళ్లిన మహిళ తన కారులోనే చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: Nainika : అబ్యూజ్ చేస్తే భరించాలి అన్నట్టు ఉండిపోయింది.. సూసైడ్ ప్రయత్నం చేశాను..

రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్‌ఝున్‌లో ముకేశ్ కుమారి అంగన్‌వాడీ సూపర్ వైజర్ గా పనిచేస్తుంది. ఆమె పదేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అయితే, గతేడాది ఫేస్‌బుక్‌లో బార్మేర్‌లో స్కూల్ టీచర్ గా పనిచేసే మనారామ్ తో పరిచయమైంది. ఆ పరిచయం కొద్దిరోజులకు ప్రేమగా మారింది.

ఈ క్రమంలోనే ముకేశ్ కుమారి తన ప్రియుడు మనారామ్‌ను కలుసుకోవడానికి ఝున్‌ఝున్ నుంచి బార్మేర్‌కు దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లేది. మనారామ్‌కు కూడా వివాహం జరిగింది. అయితే, భార్యాభర్తలు విడిపోయారు. వారి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.

మనారామ్‌ను పెళ్లి చేసుకోవాలని ముకేశ్ కుమారి పలు సార్లు అడిగింది. దీంతో అతనుసైతం ఒప్పుకున్నాడు. కానీ, ప్రతిసారి ఏదోఒక సాకుచెప్పి పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ముకేశ్ కుమారి, మనారామ్‌కు మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి.

ఈనెల 10వ తేదీన ముకేశ్ కుమారి తన ఆల్టో కారులో ఝున్‌ఝున్ నుంచి బార్మేర్‌లోని మనారామ్ ఇంటికి వెళ్లింది. అతడి కుటుంబ సభ్యులకు తాము ప్రేమించుకుంటున్నామని చెప్పింది. దీంతో మనారామ్, ముకేశ్ కుమారి మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని ముకేశ్ కుమారికి సర్ధిచెప్పారు. మనారామ్ సైతం ప్రస్తుతం ఈ విషయాన్ని వదిలేద్దాం.. తరువాత మాట్లాడుకుందామని ముకేశ్ కుమారికి చెప్పడంతో ఆమె శాంతించింది.

అదేరోజు సాయంత్రం ఇద్దరు కలిసి ముకేశ్ కుమారి కారులో నిర్మానుష్య ప్రాంతంకు వెళ్లారు. అక్కడ మనారామ్ ముకేశ్ కుమారి తలపై ఇనుప రాడ్డుతో గట్టిగా కొట్టాడు. దీంతో ముకేశ్ కుమారి మరణించింది. ఆమెను కారులోనే ఉంచి తాను ఇంటికి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ముకేశ్ కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో ముకేశ్ కుమారి మరణించిన సమయంలో ఆమె ఫోన్ సిగ్నల్, మనారామ్ ఫోన్ సిగ్నల్ ఒకే చోట ఉన్నట్లు గుర్తించారు. దీంతో మనారామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే చంపేశానని ఒప్పుకున్నాడు.