BJP
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుసగా మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అమిత్ షా పర్యటించనున్నారు.
బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఆ తర్వాత మహబూబాబాద్ లో బీజేపీ నిర్వహించే సభలో పాల్గొంటారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని నిజాంపేటలో రోడ్ షో నిర్వహిస్తారు. ఇవాళ రాత్రి ఐటీసీ కాకతీయలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మే 13న ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు.
Also Read: 3 నెలల్లో అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది, గెలుపు పక్కా- కేసీఆర్ హాట్ కామెంట్స్