KA Paul
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో త్వరలో ఈ నియోజకవర్గంలో ఉప ఉన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానాలు ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే, ఈ ఎన్నికల్లో ప్రశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు.
Also Read: BRS: గులాబీ పార్టీని వదలని వరుస కష్టాలు.. బీఆర్ఎస్ పెద్దల్లో మళ్లీ కలవరం..! కారణం అదేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనను పోటీ చేయమని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించడం ద్వారా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మ్యానిఫెస్టోను కేఏ పాల్ విడుదల చేశారు.
కేఏ పాల్ గ్యారెంటీ హామీలు..
♦ ప్రశాంతి పార్టీని గెలిపించిన వంద రోజుల్లో జూబ్లీహిల్స్ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతిఒక్క నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం.
♦ జూబ్లీహిల్స్ పరిదిలోని విలేఖరులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ఒక్క సంవత్సరంలోనే డబుల్ బెడ్ రూం ఉచితంగా కట్టించి ఇవ్వటం జరుగుతుంది.
♦ జూబ్లీహిల్స్ స్లమ్ ఏరియాల్లో కనీస సౌకర్యాలు లేవు. నీళ్లు, రవాణా, ఆరోగ్యం సదుపాయాలు అందుబాటులోకి తేవడంతోపాటు స్కిల్ డవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు.
♦ సినీ పరిశ్రమకు, వ్యాపారస్తులకు, ఐటీ రంగంలోని, మెడికల్ రంగంలోని వారి సమస్యలను పరిష్కరించి వారికి అన్ని విధాల అండగా నిలుస్తాం.
♦ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేదావులు, సంఘ సంస్కర్తలకు సముచిత స్థానం కల్పిస్తాం.
♦ నియోజకవర్గంలో ఉన్నవారందరికీ ఉచిత విద్య,
♦ నియోజకవర్గంలోని ప్రజలకు ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తామని కేఏ పాల్ తెలిపారు.
వీటితోపాటు.. మరికొన్ని హామీలను కేఏ పాల్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.