Jubilee Hills ByPoll Results
Jubilee Hills ByPoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్ నుంచి ప్రతీ రౌండ్ లో తన ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వస్తున్నారు. తద్వారా భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. గాంధీ భవన్ వద్దకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయకులు చేరుకున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండటంతో గాంధీ భవన్ లో సంబురాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో పార్టీ నేతలు గాంధీ భవన్ వద్దకు చేరుకున్నారు. తగ్గేదేలే, రప్పారప్పా డైలాగ్ లతో సీఎం రేవంత్ ఫొటో పెట్టుకొని సంబురాలు చేసుకుంటున్నారు. 2028 ఎన్నికల్లో వంద సీట్లు గ్యారెంటీ అంటూ ఫ్లెక్సీలను హస్తం నేతలు సిద్ధం చేసుకున్నారు.
నవీన్ యాదవ్ గెలుపు దాదాపు ఖాయం కావడంతో గాంధీ భవన్ వద్దకు మంత్రులు చేరుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి సంబురాల్లో పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ హవాతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతమని ప్రజలు తీర్పునిచ్చినట్లయిందని.. ఇదే ఊపును కొనసాగిస్తూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.