Naveen Yadav : దూసుకెళ్తున్న నవీన్ యాదవ్.. ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లొచ్చాయో తెలుసా..? 15ఏళ్ల నిరీక్షణ తరువాత..
Naveen Yadav : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్ నుంచి ప్రతీ రౌండ్ లోనూ
Naveen Yadav
Naveen Yadav : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదటి రౌండ్ నుంచి ప్రతీ రౌండ్ లోనూ తన ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ ప్రదర్శిస్తూ వస్తున్నారు. దీంతో 15ఏళ్ల నిరీక్షణ అనంతరం నవీన్ యాదవ్ కోరిక నెరవేరబోతున్నట్లు ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
ఇదిలాఉంటే.. నవీన్ యాదవ్ మొదటి సారిగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 41,656 ఓట్లు (25.19శాతం) వచ్చాయి. దీంతో రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ నవీన్ యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇండీపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయగా.. నవీన్ యాదవ్‌కు 18,817 ఓట్లు (12.09శాతం) వచ్చాయి. దీంతో ఆయన మూడో స్థానంకు పడిపోయారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన విష్ణువర్దన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయిన నవీన్ యాదవ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో వరుసగా మూడోసారి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అయితే, ఇటీవల మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో ఉపఎన్నికలు రావడంతో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పోటీ చేశారు.
ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు వెలువడుతున్నాకొద్ది నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. దీంతో ముఖ్యంగా నవీన్ యాదవ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. 15ఏళ్ల నిరీక్షణ తరువాత తమ అభిమాన నాయకుడు నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
