Jubilee Hills Rape Case : అంతా కలిసే అత్యాచారం, నిందితుల్లో కనిపించని పశ్చాత్తాపం

రేప్ కేసు నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో వారంతా చాలా జాలీగా ఉన్నారని చెప్పారు. తాము తప్పు చేయలేదన్న భావనతో నిందితులు ఉన్నారని అన్నారు.

Jubilee Hills Rape Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేప్ కేసు నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. విచారణ సమయంలో వారంతా చాలా జాలీగా ఉన్నారని చెప్పారు. తాము తప్పు చేయలేదన్న భావనతో నిందితులు ఉన్నారని అన్నారు.

JubileeHills Gang Rape : మైనర్లు కాదు మహా ముదుర్లు.. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లోని అశ్లీల దృశ్యాలు చూసి రేప్

ఇక అరెస్ట్ కు ముందు వీడియో లీకేజీపై నిందితుల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వీడియో షూట్ చేసిన ఓ మైనర్ పై నిందితులు ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసులు తేల్చారు. బెంజ్ కారుని పోలీసులకు చిక్కకుండా చేసేందుకు నిందితుల కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేశారు. బెంజ్ కారులో విషయంలో నిందితులు, వారి కుటుంబసభ్యులు పోలీసులను తప్పుదోవ పట్టించి పక్కింట్లో దాచారు. అయితే, కారు నెంబర్ ఆధారంగా గాలించి పట్టుకున్నారు పోలీసులు.

Jubilee Hills GangRape : ఇన్నోసెంట్‌గా కనిపించింది, అందరం కలిసే అత్యాచారం.. వెలుగులోకి మైనర్ల క్రూరత్వం

లైంగిక దాడి చోటు చేసుకున్న ఇన్నోవా కారు వక్ఫ్ బోర్డు చైర్మన్ అధికారిక వాహనం కాదని తేల్చారు. సొంత కారుపైనే గవర్నమెంట్ స్టిక్కర్ వేసుకున్న వక్ఫ్ బోర్డు చైర్మన్.. అత్యాచారం తర్వాత ఆన్ గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్ ను నిందితులు తొలగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు ఏడుగురి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. మరోవైపు బెంజ్ కారు యజమానిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు