Jubilee Hills GangRape : ఇన్నోసెంట్‌గా కనిపించింది, అందరం కలిసే అత్యాచారం.. వెలుగులోకి మైనర్ల క్రూరత్వం
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మైనర్ల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది.(Jubilee Hills GangRape)

Jubilee Hills Gang Rape
Jubilee Hills GangRape : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మైనర్ల క్రూరత్వం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు పబ్ లో ఏం జరిగింది? అనేది.. ఇద్దరు మైనర్లు కస్టడీలో పోలీసులకు చెప్పారు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్ లోని అశ్లీల దృశ్యాలే అత్యాచారానికి ప్రేరణ అని మైనర్లు విచారణలో చెప్పారు.
Minor Girls Gang Raped : పోర్న్ వీడియోలు చూసి ఘోరం.. ఇద్దరు చిన్నారులపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్
పబ్ లో అమాయకంగా కనిపించడంతో బాధిత బాలికతో పాటు మరో బాలికతో మైనర్లు మాట కలిపారు. అందరూ కలిసే అత్యాచారం చేశామని మైనర్లు అంగీకరించారు. పబ్ బేస్ మెంట్ లోనూ మరోసారి బాలికపై మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర కుమారుడే అసలు సూత్రధారి అని ఈ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు బాలిక వెంటపడ్డారని సాదుద్దీన్ చెప్పాడు. ఫ్రెండ్స్ బలవంతం చేయడంతోనే తాను బాలికను రేప్ చేసినట్లు సాదుద్దీన్ వెల్లడించాడు.
Jubilee Hills Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్న మైనర్లు
ముగ్గురు మైనర్లకు ఇవాళ (జూన్ 14), మరో ఇద్దరు మైనర్లకు రేపటితో (జూన్ 15) కస్టడీ విచారణ ముగియనుంది. నిన్న(జూన్ 13) కస్టడీ ముగియడంతో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అనంతరం చంచల్ గూడ జైలుకి తరలించారు. బాధితురాలు మైనర్ అయినందున వల్ల పోక్సో చట్టం ప్రకారం ఈ కేసులో నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.(Jubilee Hills GangRape)
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
నిందితులను విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు చార్జిషీట్ సమర్పించేందుకు వీలుగా వేగంగా సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. పోక్సో చట్టం ప్రకారం ప్రతి కేసులోనూ 60 రోజుల్లోగా అభియోగపత్రం సమర్పించాలనే నిబంధన ఉండటంతో అందులో పొందుపరచాల్సిన అంశాలపై పోలీసుల ఫోకస్ పెట్టారు. పక్కా ఆధారాలతో ఈ కేసులో మైనర్ నిందితులకు పెద్ద శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు ఎవిడెన్స్ సేకరించినట్లు సమాచారం.
తనపై కారులో ఐదుగురు అత్యాచారం చేశారని బాలిక ఇదివరకే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆ వాంగ్మూలానికి తగ్గట్టుగా పబ్ నుంచి బేకరీకి, బేకరీ నుంచి అత్యాచారం జరిగిన ప్లేస్ కు, ఇదంతా రికార్డ్ అయిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సంపాదించారు. వారంతా బాలికతో కలిసి ఉన్నారనడానికి ఇవి పక్కా ఆధారాలు. అంతేకాకుండా ఘటన జరిగిన స్థలంలో ఆ సమయంలో నిందితులు అక్కడే ఉన్నట్లు బాధిత బాలికతో పాటు వారి సెల్ ఫోన్ టవర్ లొకేషన్ డేటాను కూడా పోలీసులు సేకరించారు.