Jubilee Hills Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్న మైనర్లు

బాలికతో ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని, అతడి తర్వాత తామూ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మైనర్లు పోలీసులతో తెలిపారు. ఇక తమను రెచ్చగొట్టిందని ఏ-1 సాదుద్దీన్ అని వివరించారు.

Jubilee Hills Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్న మైనర్లు

Jubilee Hills Gang Rape

Jubilee Hills Rape Case : రాష్ట్రంలో సంచలన రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు విచారణలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అత్యాచారం కేసులో ఆరో మైనర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో మైనర్ ప్రమేయం నిందితులను ఆరా తీశారు. శనివారం ముగ్గురు మైనర్లను, ఓ మేజర్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విడివిడిగా విచారించారు పోలీసులు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

విచారణలో ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకున్నారు మైనర్లు. బాలికతో ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని, అతడి తర్వాత తామూ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మైనర్లు పోలీసులతో తెలిపారు. ఇక తమను రెచ్చగొట్టిందని ఏ-1 సాదుద్దీన్ అని పోలీసులకు వివరించారు. అటు బాలికతో మొదట అసభ్యంగా ప్రవర్తించింది మైనర్లేనని సాదుద్దీన్ వెల్లడించాడు.

Jubilee Hills Minor Rape : జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఆ ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు

ఇక అత్యాచారం కేసులో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారికి లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి జనరల్ మెడికల్ టెస్టులు చేశారు. మెడికల్ టెస్టులకు అధిక సమయం పట్టడంతో కేవలం 60 నిమిషాలు మాత్రమే నిందితులను ప్రశ్నించారు పోలీసులు. రేప్ తర్వాత అంతా కలిసి ప్లాన్ ప్రకారమే ఎస్కేప్ అయ్యారా? హైదరాబాద్ నుంచి తప్పించుకోవటానికి ఎవరు సహకరించారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. అత్యాచారం కేసులో 6వ మైనర్ పాత్రపై కూపీ లాగారు.

Potency Test : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. మైనర్లకు లైంగిక సామర్థ్య పరీక్షలు