Jubileehills Gang Rape Case
JubileeHills Gang Rape Case : సంచలనం రేపిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టు అనుమతితో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు పూర్తి చేశారు. న్యాయమూర్తి సమక్షంలో నిందితుల గుర్తింపు ప్రక్రియ నిర్వహించారు పోలీసులు. అత్యాచార నిందితులను ఇతర ఖైదీల మధ్య ఉంచి వారిని గుర్తించాలని బాధితురాలని కోరారు పోలీసులు. దీంతో తనపై అత్యాచారం చేసిన వారిని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు చెప్పిన వివరాలను న్యాయమూర్తి నమోదు చేసుకున్నారు.
JubileeHills Rape Case : రేప్ కేసు.. వెలుగులోకి కొత్త విషయాలు, బాలిక కుటుంబసభ్యులకు బెదిరింపులు
ఈ కేసులో ఆరుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో మేజర్, ప్రధాని నిందితుడు సాదుద్దీన్ చంచల్‌గూడ జైల్లో ఉండగా.. మిగిలిన ఐదుగురు మైనర్లు సైదాబాద్ లోని జువెనైల్ హోమ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తనపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయమూర్తికి తెలిపింది.
JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.. మిగతా ఇద్దరూ అరెస్ట్
నిందితుల గుర్తింపు ప్రక్రియను సోమవారం పోలీసులు చేపట్టగా… చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయమూర్తి సమక్షంలోనే నిందితులను గుర్తించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు బాధితురాలు సమాధానమిచ్చింది. ఈ వివరాలన్నింటినీ పోలీసులు నమోదు చేసుకున్నారు. ఈ వివరాలను వారు కోర్టుకు అందజేయనున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని అమ్నేషియా పబ్ పరిసరాల్లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw