తీగలాగే కొద్దీ బయటపడుతున్న శివ బాలకృష్ణ అక్రమాలు.. మొన్నటి వరకు గొప్ప హోదా.. ఇప్పుడు చంచల్‌గూడ జైల్‌కు..

శివ బాలకృష్ణకు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిబ్రవరి 8వరకు రిమాండ్ లో ఉండనున్నారు. ఆయనను చంచల్‌గూడ జైల్ కు తరలించారు.

Shiva BalaKrishna

Shiva BalaKrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో చేసిన దాడులపై అవినీతి నిరోధక శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో సోదాలు చేశామని తెలిపింది. నిందితుడు బాలకృష్ణపై 13 (1) (b) , 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించింది.

బాలకృష్ణ ఇళ్లతో పాటు, ఆయన బంధువులు, సహచురులు ఇళ్లల్లో సోదాలు చేశామని తెలిపింది. బాలకృష్ణ ఇంట్లో రూ.99 .60 లక్షల నగదు సీజ్ చేశామని పేర్కొంది. 1988 గ్రాముల బంగారం, 6 కేజీల సిల్వర్ సీజ్ చేసినట్లు వివరించారు. రూ.8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సీజ్ చేసిన ఆస్తుల విలువ మార్కెట్ వ్యాల్యూలో ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పారు. మిగిలిన బీనామీల పై విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలో బాలకృష్ణకు వైద్య పరీక్షలు ముగిశాక ఏసీబీ న్యాయస్థానం ముందు ఆయనను అధికారులు హాజరుపరిచారు.

శివ బాలకృష్ణకు 14రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. పిబ్రవరి 8వరకు రిమాండ్ లో ఉండనున్నారు. ఆయనను చంచల్‌గూడ జైల్ కు తరలించారు.

నేను వస్తున్నా, కాస్కోండి.. మిమ్మల్ని 100 మీటర్ల లోతులో..- విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు