MLC Kavitha-Delhi liquor scam: నేను సుప్రీంకోర్టులో అటువంటి విజ్ఞప్తి చేయలేదు: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఓ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని కోరలేదని అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషనే మార్చి 24న విచారణకు వస్తుందని చెప్పారు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న విచారణ జరుపుతామని ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

MLC Kavitha-Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం​ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటోన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఓ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని కోరలేదని అన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషనే మార్చి 24న విచారణకు వస్తుందని చెప్పారు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించడంపై ఈ నెల 24న విచారణ జరుపుతామని ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

దీంతో, తాను ఇవాళ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని కవిత అన్నారు. ఆమె ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న రెండోసారి విచారణ జరగాల్సి ఉండగా అందుకు హాజరుకాలేదు. దీంతో నిన్న ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్న కేసీఆర్ నివాసం వద్ద ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు.

ఈడీ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. సుప్రీంకోర్టులో ఈ నెల 24 జరగనున్న విచారణ గురించే కవిత ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు ఈడీ విచారణకు హాజరుకానని చెప్పారు. అయితే, ఈనెల 20న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమె విచారణకు వెళ్తారా? అన్న సందిగ్ధత నెలకొంది.

Foxconn invest: తెలంగాణలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడి.. ఎయిర్‌పాడ్ల తయారీ కేంద్రం ఏర్పాటు యోచన

ట్రెండింగ్ వార్తలు