Site icon 10TV Telugu

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత? బుధవారం ప్రెస్‌మీట్‌.. ప్రస్తుతం ఈ అంశాల పరిశీలన

BRS leader K Kavitha

BRS leader K Kavitha

BRS leader K Kavitha: బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ చుట్టూ ఉండే నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సస్పెన్షన్‌కు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం కవిత మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు.

ఆమె కొత్త పార్టీ పెడతారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య తన ఎమ్మెల్సీ పదవిని కొనసాగించాలా? లేదా? అన్న విషయంపై ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. (BRS leader K Kavitha)

అయితే, బీఆర్ఎస్‌ నుంచి సస్పెన్షన్‌తో పాటు ఇప్పటికే ఆమె ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేసే ముందు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని, దీనిపై అన్ని విధాలుగా ఆలోచించే అవకాశం ఉంది.

Also Read: భారత్‌లోకి Realme 15T వచ్చేసింది.. 7,000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఓర్నాయనో స్పెసిఫికేషన్లు ఎగిరిగంతులేసేలా ఉన్నాయ్.. డిస్కౌంట్..

కవిత 2014-2019 మధ్య నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. 2020లో నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె పదవీ కాలం 2026 వరకు కొనసాగనుంది. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న పరాజయాలు, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి వేళ కవిత వ్యవహారం కీలకంగా మారింది.

కవిత రాజీనామా చేస్తారా? పదవిలో కొనసాగుతారా? అన్న ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్‌ కూడా ఈ పరిణామాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని సమాచారం. కవిత తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది.

Exit mobile version