K Laxman: బీజేపీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయాలు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై..

బీజేపీ నేతలు పార్టీ మారతారనేది ఊహాగానాలు మాత్రమేనని లక్ష్మణ్ తెలిపారు.

Dr K Laxman

Telangana – BJP: బీజేపీ తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్న వేళ ఇవాళ ఢిల్లీ(Delhi)లో బీజేపీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ మోర్చా అధ్యక్షుల సమావేశం జరిగింది. బండి సంజయ్ (Bandi Sanjay)ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి నుంచి తొలగించే విషయంలో ఇందులో చర్చ జరుగుతుందని అందరూ భావించారు. అయితే, దీనిపై చర్చించలేదని తెలుస్తోంది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. పార్టీ బలోపేతం, సంస్థాగత అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని అన్నారు. జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ నేతృత్వంలో పలు అంశాలపై చర్చించామని తెలిపారు.

త్వరలో దేశంలోని 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు రోడ్ మ్యాప్ పై చర్చించామన్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, బీసీ కార్యాచరణ, సదస్సులు, సామాజిక సమ్మేళనలు జరపాలని నిర్ణయించామని అన్నారు. నెల రోజుల్లో రోడ్ మ్యాప్ తయారు చేసి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. జులై 8న మరోసారి మోర్చా అధ్యక్షుల సమావేశం జరుగుతుందని అన్నారు.

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడం ప్రధాని మోదీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, రైతుల కోసం తీసుకున్న నిర్ణయాలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలు బీజేపీ తీసుకుందని గుర్తు చేశారు.

తెలంగాణలో పరిస్థితులపై..
పార్టీ విస్తరిస్తున్నపుడు భిన్నాభిప్రాయాలు రావడం సహజమని కె.లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కి తమ పార్టీనే ప్రత్యామ్నాయమని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకే గూటి పక్షులని చెప్పారు. బీజేపీ నేతలు పార్టీ మారతారనేది ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈ నెల 9వ తేదీ తెలంగాణలో చర్చ జరుగుతుందని అన్నారు. 8వ తేదీన తెలంగాణకు మోదీ వస్తున్నారని అన్నారు. నాయకత్వ మార్పు గురించి పార్టీలో చర్చ జరగలేదని చెప్పారు.

Karumuri Nageshwara Rao : అది తెలిస్తే చంద్రబాబు గుండె ఆగిపోతుంది : మంత్రి కారుమూరి

ట్రెండింగ్ వార్తలు