cheeti sakalamma passed away
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి చీటి సకలమ్మ (82) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ కు సకలమ్మ ఐదో సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితం మరణించాడు.
Also Read: Casino : హైదరాబాద్ లో మరోసారి క్యాసినో కలకలం.. రాజమండ్రి, విశాఖ నుంచి కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్..!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మొత్తం పది మంది తోబుట్టువులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది అక్కలు కాగా.. ఒక అన్న, ఒకరు చెల్లి. వీరిలో ఇద్దరు సోదరీమణులు ఇప్పటికే కన్నుమూయగా.. తాజాగా మరో సోదరి సకలమ్మ తుదిశ్వాస విడిచారు. కేసీఆర్ కు తన సోదరీమణులంటే ఎంతో ప్రేమ. ప్రతీయేటా కేసీఆర్ కు అక్కలు, చెల్లి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా సకలమ్మ మృతితో కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. సకలమ్మ, హన్మంతరావు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. సకలమ్మ మరణవార్త తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆస్పత్రికి వెళ్లారు.
Also Read: Bandla Ganesh : ఇది ధర్మమా..! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయంపై బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్..
సకలమ్మ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియల్లో పాల్గోనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇవాళ జరగాల్సిన పార్టీ సమావేశాన్ని వాయిదా వేయడం జరిగిందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇవాళ హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతోపాటు ఇతర ముఖ్య నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. అయితే, కేసీఆర్ సోదరి మృతితో ఇవాళ్టి సమావేశం వాయిదా పడినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
కేసీఆర్ కుటుంబంలో విషాదం
కేసీఆర్ ఐదవ సోదరి చీటీ సకలమ్మ గారు కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు pic.twitter.com/Wn5vjv3lbf
— Praveen Kumar BSP (@praveen_mnp) January 24, 2025