Casino : హైదరాబాద్ లో మరోసారి క్యాసినో కలకలం.. రాజమండ్రి, విశాఖ నుంచి కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్..!
కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండటంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది.

Casino : హైదరాబాద్ లో మరోసారి క్యాసినో కలకలం రేగింది. నగరానికి చెందిన హరి అనే వ్యక్తి శ్రీలంక కొలంబోలో భారీ క్యాసినోకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. హరి ఈవెంట్స్ పేరుతో ఏపీకి చెందిన పలువురిని కొలంబోకి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి మరీ తీసుకెళ్లినట్లుగా సమాచారం. రాజమండ్రి, విశాఖల నుంచి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయలు చేతులు మారే ఛాన్స్ ఉండటంతో ఐటీ, ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. మనీలాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది.
25 లక్షలు ఉంటేనే గేమ్ లోనికి అనుమతి..
ఈ ఈవెంట్ వెనుక పలువురు నేతల ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది. కొలంబో వెళ్లే ఫ్లైట్ వివరాలు ఈడీ ఆరా తీస్తోంది. హరి ప్రధాన అనుచరులు కృష్ణంరాజు, లచ్చ ఇప్పటికే కొలంబో చేరుకున్నట్లు సమాచారం. 24, 25, 26, 27 తేదీలలో కొలంబో క్యాసినో ఈవెంట్ అంటూ ప్రకటన చేసినట్లుగా అధికారులు గుర్తించారు. 2, 5, 10, 15, 25 లక్షల రూపాయలు ఉంటేనే గేమ్ లోపలికి అనుమతిస్తామని హరి ప్రకటించినట్లుగా సమాచారం.
రూ.16కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్న హరి..!
రూ.16 కోట్లు ఈవెంట్ కోసం హరి రూ.16 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. 180 మందికి రెండు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశాడు హరి. ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ప్రముఖుల కోసం కొలంబో క్యాసినో ఏర్పాటు చేశాడని చెబుతున్నారు. కాగా, హరి గతంలోనూ క్యాసినో ఈవెంట్స్ నిర్వహించాడని అధికారుల విచారణలో తెలిసింది.
హైదరాబాద్ కేంద్రంగా మరోసారి క్యాసినో ఈవెంట్ వ్యవహారం వెలుగుచూడటం కలకలం రేపింది. కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసి ఏపీతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తీసుకెళ్లి క్యాసినో ఆడిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు సంబంధించి తెరవెనుక ఏపీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లుగా తెలిసింది. కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉండటంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. ఈవెంట్స్ ఎన్ని రోజులుగా చేస్తున్నారు, దీని వెనుక ఎంతమంది హస్తం ఉంది అనే కోణంలో దర్యాఫ్తు జరుగుతోంది.
Also Read : ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు.. మీర్ పేట్ మాధవి కేసులో ఆధారాలు దొరికేశాయ్