ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు.. మీర్ పేట్ మాధవి కేసులో ఆధారాలు దొరికేశాయ్

గురుమూర్తి నివాసంలో మరోసారి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కీలక ఆధారాలను సేకరించారు.

ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు.. మీర్ పేట్ మాధవి కేసులో ఆధారాలు దొరికేశాయ్

Hyderabad Ex Jawan Gurumurthy Case

Updated On : January 24, 2025 / 3:36 PM IST

హైదరాబాద్ మీర్ పేట పీఎస్ పరిధి జిల్లెలగూడలో జరిగిన దారుణ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. నిందితుడు గురుమూర్తి తన భార్య మాధవిని హత్య చేసిన తరువాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, ఎముకలను బూడిద చేసి వాటిని చెరువులో, డ్రెయినేజీల్లో పడేశాడు. పోలీసుల విచారణలో తన భార్యను హత్యచేసింది నేనేనని గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ.. అందుకు తగిన ఆధారాలు దొరక్క పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి. అసలు చనిపోయింది వెంకట మాధవినేనా అనే అనుమానాలుసైతం పోలీసులు వ్యక్తం చేశారు. అయితే, ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఎదురవుతున్న సవాళ్లకు చిక్కుముడులు విప్పేలా ఆధారాలు లభించాయి.

Also Read: అమ్మ ఎక్కడ నాన్న అని పిల్లలు అడిగితే.. గురుమూర్తి సమాధానం ఇదే..

గురుమూర్తి నివాసంలో మరోసారి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రక్తపు ఆనవాళ్లను గుర్తించారు. అంతేకాక.. శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్లను పోలీసులు సేకరించారు. ఎముకలను కాల్చిన ప్రాంతంలో దొరికిన ఆనవాళ్ల నుంచి డీఎన్ఏ సేకరించారు. దొరికిన డీఎన్ఏతోపాటు వారి పిల్లల డీఎన్ఏతో పోలీసులు టెస్టుకు పంపనున్నారు. హత్య చేయడానికి ఉపయోగించిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తి ఇంట్లో ఇన్ఫ్రా రెడ్ ద్వారా రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు.

Also Read: భార్యను ముక్కలు చేసి ఉడికిస్తుండగా దుర్వాసన.. అప్పుడు స్థానికులు ప్రశ్నించడంతో నిందితుడు ఏం చెప్పాడంటే?

నిందితుడు గురుమూర్తిని పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. ఆ తరువాత ఆయన్ను రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలాఉంటే.. పోలీసులు గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను రికార్డుచేశారు. పండుగ తరువాత ఇంటికి రాగానే దుర్వాసన వచ్చిందని గురుమూర్తి కుమార్తె తెలిపింది. ఇంటికి రాగానే అమ్మ ఎక్కడ నాన్న అని అడిగానని.. కానీ, నాన్న మౌనంగా ఉన్నాడని పోలీసుల స్టేట్మెంట్ లో గురుమూర్తి కుమార్తె పేర్కొంది. మరోవైపు, గురుమూర్తి ఫ్యామిలీలో గతంలో ఎప్పుడైనా గోడవలు జరిగాయా.. వారు ఎలాఉండేవారు అనే వివరాలను స్థానికుల నుంచి పోలీసులు సేకరించారు.