భార్యను ముక్కలు చేసి ఉడికిస్తుండగా దుర్వాసన.. అప్పుడు స్థానికులు ప్రశ్నించడంతో నిందితుడు ఏం చెప్పాడంటే?

భార్యను హత్యచేసిన తరువాత గురుమూర్తి పోలీసులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి

భార్యను ముక్కలు చేసి ఉడికిస్తుండగా దుర్వాసన.. అప్పుడు స్థానికులు ప్రశ్నించడంతో నిందితుడు ఏం చెప్పాడంటే?

Meerpet Women Incident

Updated On : January 24, 2025 / 3:35 PM IST

హైదరాబాద్ లోని మీర్ పేట్ పరిధిలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురుమూర్తి తన భార్యను చంపి ముక్కలు చేసి పడేసిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య వెంకటమాధవి చనిపోయిన తరువాత ఆమె శరీర భాగాలను ముక్కలు చేసేందుకు ముందుగా అతడికి ధైర్యం చాలలేదు. దీంతో ఫుల్లుగా మద్యం సేవించి భార్య మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసినట్లు తెలిసింది. అయితే, అతన్ని పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనూ ఫుల్లుగా మద్యం మత్తులోనే ఉన్నట్లు సమాచారం. పోలీసులు తనిఖీల్లో భాగంగా అతని నివాసంలోని వంటగదిలో మద్యం బాటిల్, మటన్ కొట్టే మొద్దు ను గుర్తించారు.

Also Read: ఓరినాయనో.. భార్యను చంపడానికి ముందు ప్రాక్టీస్ కోసం.. గురుమూర్తి ఇంకో ఘాతుకం

భార్యను హత్యచేసిన తరువాత గురుమూర్తి పోలీసులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి ఉడికించాడు.. ఆ తరువాత ఎముకలను వేరుచేసి వాటిని మంటల్లో కాల్చేసి ఆ బూడిదను జిల్లెల గూడలోని చంద చెరువులో పడేశాడు. మాంసం ముద్దలను డ్రైనేజీల్లో పడేశాడు. ఇంట్లోసైతం ఎలాంటి ఆధారాలు లేకుండా గురుమూర్తి జాగ్రత్త పడ్డారు. అయితే, పోలీసుల విచారణలో వెంకటమాధవిని తానే హత్యచేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. అంతేకాక.. చనిపోయింది వెంకటమాధవి అని నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో.. ఆధారాలను సేకరించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గురుమూర్తి నివాసంలో అణువణువు తనిఖీ చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ పుటేజీ, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Jammikunta CI Audio Viral : 3 లక్షలు లంచం ఇచ్చినా కేసు ఎందుకు పెట్టావ్? సీఐతో వ్యక్తి వాగ్వాదం.. ఆడియో వైరల్

గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసిన తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఇంట్లోని పెద్ద స్టవ్ పై కుక్కర్ లో ఉడికించాడు. ఆ తరువాత ఉడికించిన ముక్కల నుంచి ఎముకలను వేరు చేసి వాటిని కాల్చాడు. ఆ సమయంలో దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు గురుమూర్తిని ప్రశ్నించారు. మేక కాళ్లు, తలకాయ తెచ్చి వండుతున్నా.. అవి ఉడకబెడుతుంటే ఈ వాసన వస్తుంది అని చెప్పినట్లు స్థానికులు తెలిపారు.

మరోవైపు గురుమూర్తి భార్యను దారుణంగా హత్యచేసిన ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా ఉన్న కొందరు భయంతో తమ ఇళ్లను ఖాళీచేసి వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. మీర్ పేట్ హత్యకేసులో తన భార్యను గురుమూర్తే దారుణ హత్యకు పాల్పడినట్లు రుజువైనప్పటికీ.. అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.