Jammikunta CI Audio Viral : 3 లక్షలు లంచం ఇచ్చినా కేసు ఎందుకు పెట్టావ్? సీఐతో వ్యక్తి వాగ్వాదం.. ఆడియో వైరల్

డబ్బులను నేరుగా తాను ఉండే గదిలోని బాత్ రూమ్ లో ఒక డబ్బా కింద పెట్టి వెళ్లాలని సీఐ సూచన చేశారని..

Jammikunta CI Audio Viral : 3 లక్షలు లంచం ఇచ్చినా కేసు ఎందుకు పెట్టావ్? సీఐతో వ్యక్తి వాగ్వాదం.. ఆడియో వైరల్

Updated On : January 23, 2025 / 6:01 PM IST

Jammikunta CI Audio Viral : కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ రవితో ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. సాబీర్ అనే వ్యక్తి సీఐ రవికి 3 లక్షల రూపాయలు లంచం ఇచ్చానటం ఆ ఆడియోలో ఉంది. లంచం తీసుకుని కూడా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారేంటని అతడు అడిగాడు. సీఐ క్యాబిన్ బాత్రూమ్ లో రూ.3లక్షలు పెట్టానంటూ ఆడియోలో సాబీర్ అనే వ్యక్తి చెప్పాడు. స్టేషన్ కు రా.. మాట్లాడుకుందాం అంటూ సాబీర్ అనే వ్యక్తిని సీఐ పదే పదే కోరడం ఆ ఆడియోలో ఉంది. సీఐతో సాబీర్ మాట్లాడిన ఆడియో కాల్ వైరల్ గా మారింది.

సీఐ రవి 3 లక్షల రూపాయలు లంచం తీసుకుని కేసు నమోదు చేయడాన్ని సాబీర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ ఆడియోని వైరల్ చేస్తున్నాడు. సీఐ, సాబీర్ మధ్య జరిగినట్లుగా చెబుతున్న సంభాషణకు సంబంధించిన ఆ ఆడియో క్లిప్ సంచలనంగా మారింది. జమ్మికుంట సీఐ రవి, స్థానికంగా నివాసం ఉండే సాబీర్ మధ్య సంభాషణ జరిగింది. ఓ కేసు విషయంలో సీఐకి 3 లక్షలు ముట్టజెప్పినట్లుగా ఆ ఆడియో సారాంశం.

Also Read : అందరూ చూస్తుండగానే క్లాస్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చి.. మూడో అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి

డబ్బులను నేరుగా తాను ఉండే గదిలోని బాత్రూమ్ లో ఒక డబ్బా కింద పెట్టి వెళ్లాలని సీఐ సూచన చేశారని, ఆయన సూచన మేరకే డబ్బులు తాను అక్కడ పెట్టానని సాబీర్ చెబుతున్నాడు. అంతేకాదు, ఆ డబ్బులు అక్కడ పెట్టడాన్ని తాను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసినట్లుగా సాబీర్ వెల్లడించాడు. వీరిద్దరి మధ్య దాదాపు 10 నిమిషాల పాటు సంభాషణ జరిగింది.

ఆ ఆడియోలో సాబీర్ అనే వ్యక్తి సీఐని ప్రశ్నించడం, సీఐ రవి తడబడుతూ సమాధానం చెప్పడం, ఇరువురు 10 నిమిషాల పాటు నిరంతరం మాట్లాడుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడీ ఆడియో వైరల్ గా మారింది. సీఐ, సాబీర్ మధ్య సంభాషణ స్థానికంగా సంచలనంగా మారింది.

ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అసలేం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. తాను సీఐకి మూడు లక్షలు లంచం ఇచ్చానని, మూడు లక్షలు తీసుకుని కూడా ఎలా కేసు పెడతారంటూ సీఐని సాబీర్ ప్రశ్నించడం, సీఐ తడబడుతూ మాట్లాడటం.. హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెళ్లొచ్చాం.. తాళి తీసి నా ముఖంపై విసిరేసింది.. భార్యను ముక్కలుచేసిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు