‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెళ్లొచ్చాం.. తాళి తీసి నా ముఖంపై విసిరేసింది.. భార్యను ముక్కలుచేసిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాల ప్రకారం..

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెళ్లొచ్చాం.. తాళి తీసి నా ముఖంపై విసిరేసింది.. భార్యను ముక్కలుచేసిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Husband brutally kills wife Case

Updated On : January 23, 2025 / 7:50 PM IST

రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను భర్త హత్యచేశాడు. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండించడంతోపాటు.. ఎముకలను వేరుచేసి కాల్చి బూడిద చేశాడు. ఆ బూడిదను చెరువులో పడేశాడు. కుక్కర్ లో ఉడికించిన మాంసం ముద్దలను డ్రైనేజీలో పడేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, క్రైంకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

వెంకట మాధవి, గురుమూర్తి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గురుమూర్తి భార్యను అనునించేవాడు. ఎప్పటిలాగానే వారి మధ్య మాటామాటా పెరిగి గురుమూర్తి భార్యను హత్యచేశాడు. ఎవరికి అనుమానం రాకుండా, సాక్ష్యాదారాలు దొరక్కుండా ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి పడేశాడు. ఆ తరువాత అతడే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానం రావడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించాడు. దీంతో తన భార్యను నేనే చంపానని ఒప్పుకున్నాడు. ఈ కేసు విచారణలో గురుమూర్తి చెప్పిన విషయాలతో పోలీసులుసైతం షాక్ కు గురవుతున్నారు.

గురుమూర్తి పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాల ప్రకారం.. 14వ తేదీన భార్య, పిల్లలతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాకి వెళ్లాం. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాం. నా భార్య నాతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తాళి బొట్టు తీసి నా మొహంపై విసిరేసింది. దీంతో నేను ఆవేశంతో ఆమెను గోడకు అదిమి కొట్టాను. కిందపడిపోయింది. స్పృహతప్పి పడింది అనుకున్నా. కానీ, ఆమె చనిపోయిందని గుర్తించా. ఆమె మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలని అనుకున్నా.

ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకొని శరీరంలోని మొత్తం భాగాలను కోశా. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకిట్ లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేశా. ఆరు గంటలపాటు వాటిని ఉడికించా.. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడిపొడి చేశా. బొన్స్ ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చా. మొత్తం బూడిదను రెండు బకెట్లలో తీసుకెళ్లి చెరువులో పడేశా. ఆ తరువాత ఇంట్లో రక్తంను ఫెనాయిల్ తో శుభ్రంగా కడిగా అంటూ గురుమూర్తి పోలీసులు విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది.

గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లు, అన్ని వస్తువులను ఫోరెన్సిక్ టీంతో తనిఖీ చేయించారు. ఒక్క ఆధారం కూడా లభించలేదని తెలుస్తోంది. చెరువులో కూడా పోలీసులు గాలించారు. అయినా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో ఈ కేసులో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.